నాగబంధం మూవీ నుండి వీరనాగ సాంగ్ రిలీజ్...

నాగబంధం మూవీ నుండి వీరనాగ సాంగ్ రిలీజ్...

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన అడ్వెంచర్ థ్రిల్లర్‌‌  ‘నాగబంధం’. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్‌‌. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్‌‌కు పాజిటివ్ రెస్పాన్స్‌‌ రాగా, శుక్రవారం ‘వీరనాగ’ అనే పాటను విడుదల చేశారు. 

‘‘రహస్య రుద్ర సైన్యమే వీర నాగ..  విధించు రౌర నరకమే వీర నాగ.. సహస్ర జన్మ యోగమే వీర నాగ..” అంటూ సాగిన ఈ పాటను జునైద్ కుమార్ – అభే కంపోజ్ చేయగా  దీపక్ బ్లూ ఎనర్జిటిక్‌‌గా పాడారు. ‘‘నివాసమే హిమాలయం.. నినాదమే సనాతనం.., యజామహే ప్రజామహే హరోంహరం..  శరీరమే శివాలయం.. కణం కణం శివం మయం.. త్రిశూలమే కరావలం నిరంతరం” అంటూ నాగ సాధువుల ఆధ్యాత్మిక భావాన్ని ప్రతిబింబించేలా శ్రీహర్ష ఈమని సాహిత్యం రాశారు. 

నాగ సాధువుగా విరాట్ కర్ణ లుక్‌‌, బాడీ లాంగ్వేజ్‌‌, స్క్రీన్‌‌ ప్రెజెన్స్‌‌ ఆకట్టుకున్నాయి.  కైలాస పర్వతం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పాటలో నాగ సాధు తాండవం విజువల్స్ హైలైట్‌‌గా నిలిచాయి. ఇందులో జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రలు పోషించారు. జులై 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది.