సస్పెన్స్‌‌ థ్రిల్లర్‌‌‌‌ గా తత్వం మూవీ..

సస్పెన్స్‌‌ థ్రిల్లర్‌‌‌‌ గా తత్వం మూవీ..

దినేష్‌‌ తేజ్‌‌, దష్విక.కె జంటగా అర్జున్‌‌ కోల తెరకెక్కిస్తున్న చిత్రం ‘తత్వం’. వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మిస్తున్నారు.  గురువారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్ జరిగింది.  హీరో దినేష్‌‌ తేజ్‌‌ మాట్లాడుతూ ‘కంటెంట్‌‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి బలమైన కంటెంట్‌‌తో వస్తున్న సినిమా ఇది.  

నా కెరీర్‌‌కు ఇది టర్నింగ్‌‌ పాయింట్‌‌గా నిలుస్తుందనే నమ్మకముంది’ అని చెప్పాడు.  దర్శకుడు అర్జున్‌‌ కోలా మాట్లాడుతూ ‘ఇదొక సస్పెన్స్‌‌ థ్రిల్లర్‌‌‌‌ జానర్ మూవీ. వంశీ గారి ‘అన్వేషణ’ తరహాలో ప్రేక్షకులను ఎంగేజ్‌‌ చేస్తుంది. ఇందులోని ట్విస్ట్‌‌ ఆడియన్స్‌‌కు షాకింగ్‌‌గా అనిపిస్తుంది’ అని చెప్పాడు.  

‘‘టైటిల్‌‌కు తగ్గట్టుగా చాలా డిఫరెంట్‌‌గా ఉండే సినిమా ఇది. ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను చూశామన్న అనుభూతికి లోనవుతారు” అని నిర్మాతలు శ్వేత, వంశీ తెలియజేశారు. హీరోయిన్ దష్విక,  ఎడిటర్‌‌ విప్లవ్‌‌ నైషదం,  ఎగ్జిక్యూటివ్‌‌ నిర్మాత  భరత్‌‌ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.