
న్యూఢిల్లీ, వెలుగు: ‘నేషనల్ టాలెంట్ హంట్’పర్యవేక్షణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి భావన జైన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పవన్ ఖేరా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక్కొక్కరి చొప్పున 36 మంది కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు వెల్లడించారు. పూజా త్రిపాఠికి ఏపీ బాధ్యతలు అప్పగించారు. కాగా, ఈ నియామకాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎవరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు