
తెలంగాణ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా హైదారబాద్ మహిళా పోలీస్ సిబ్బంది కోసం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉమెన్స్ డే సందర్బంగా...1200 మంది మహిళా పోలీస్ సిబ్బంది కి జీవీకే మాల్ లో భీమ్లానాయక్ సినిమా చూపించనున్నారు.ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భీమ్లా నాయక్ సినిమా ఉచితంగా చూపించనున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించాడు. ఈ మూవీ మలయాళ సినిమాకి రీమేక్ అయినప్పటికీ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - సంభాషణలు మరింత కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఒరిజినల్ సినిమాలో పాటలు ఉండవు. కానీ ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
తొలిసారిగా మహిళా పోలీస్ కు స్టేషన్ బాధ్యతలు
మీ కష్టం చూస్తుంటే అమ్మ కష్టం గుర్తుకొస్తోంది