‘భీమ్లా నాయక్’ హిందీ ట్రైలర్ రిలీజ్

‘భీమ్లా నాయక్’ హిందీ ట్రైలర్ రిలీజ్

ముంబై: పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది. ఈ మూవీని తెలుగుతోపాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేద్దామనుకన్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో తెలుగు సినిమాకే మేకర్స్ ఎక్కువ సమయం కేటాయించడంతో కాస్త ఆలస్యంగా నార్త్ ఆడియన్స్ ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు భీమ్లా నాయక్. ఈ చిత్ర హిందీ వెర్షన్ ట్రైలర్ తాజాగా రిలీజైంది. రెండోసారి ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా విడుదల చేసిన ట్రైలర్‌నే హిందీలోనూ రిలీజ్ చేశారు. కానీ హిందీలో ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఇక హిందీ ట్రైలర్‌ లోనూ పవన్‌, రానాల మధ్య సీన్స్‌ హైలైట్‌ గా నిలిచాయి. 

మరిన్ని వార్తల కోసం:

వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ 

మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ

నాతో చర్చలకు రా.. పుతిన్​కు జెలెన్​స్కీ పిలుపు