
రన్ టైమ్ :2 గంటల 33 నిమిషాలు
నటీనటులు: నితిన్,రష్మిక,అనంత్ నాగ్, జిషుసేన్ గుప్తా,సంపత్,వెన్నెల కిషోర్,రఘుబాబు,నరేష్,బ్రహ్మాజీ,అజయ్ తదితరులు
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరాం
మ్యూజిక్: మహతి స్వర సాగర్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 21,2020
కథేంటి?
భీష్మ (నితిన్) డిగ్రీ ఫెయిల్ అయి టైమ్ పాస్ గా తిరుగుతుంటాడు.ఓ పనిష్మెంట్ కింద ఏసిపి (సంపత్) కింద పనిచేస్తుంటాడు.అప్పుడే వాళ్ల కూతురు క్షేత్ర (రష్మిక) ను ప్రేమిస్తాడు.ఆ విషయం తెలుసుకున్న ఏసిపి భీష్మను వాళ్లింట్లో ఎటాక్ చేస్తాడు.కానీ వాళ్ల నాన్న (నరేష్) తన కొడుకు పెద్ద ఆర్గానిక్ కంపెనీ సీఈవో అని ,ఆ నిజం ఎవరికీ తెలియదని ఏసీపీకి,మీడియాకు చెప్తాడు.ఇంతకీ భీష్మ నిజంగానే సీఈవో నా? ఆ తర్వాత ఏం జరిగింది. అనేది కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
నితిన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.కామెడీ టైమింగ్ బాగుంది.డాన్సులు,ఫైట్ల తో అలరించాడు.రష్మిక చాలా అందంగా కనిపించింది.సినిమాకు గ్లామర్ పరంగా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది.అనంత్ నాగ్ పర్ఫార్మెన్స్ ఆ రోల్ కు బాగా సూట్ అయింది.వెన్నెల కిషోర్ తనదైన పంచులతో మంచి కామెడీ పండించాడు.తనకు రఘుబాబు సహాయం కూడా అదింది.సంపత్ కుమార్ నటన బాగుంది.నితిన్ తో సంపత్ వాట్సాప్ చాట్ సీన్ హిలేరియస్ గా ఉంది.జిషుసేన్ గుప్తా విలన్ గా ఓకే.తన పాత్ర వీక్ గా అనిపిస్తుంది..బ్రహ్మాజీ,నరేష్,అజయ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ వర్క్:
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.మహతి సాగర్ మ్యూజిక్ లో రెండు పాటలు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ను క్యారీ చేసింది. యాక్షన్ సీన్లు బాగున్నాయి.ఎడిటింగ్ ఫర్వాలేదు.ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.కామెడీ పంచ్ లు కొన్ని బాగా పేలాయి.
విశ్లేషణ:
‘‘భీష్మ’’ ఓ టైమ్ పాస్ కామెడీ ఎంటర్ టైనర్.డైరెక్టర్ వెంకీ కుడుముల తన మొదటి సినిమా ‘ఛలో’ లాగానే ఈ మూవీకి కామెడీ మెయిన్ పాయింట్ గా వాడుకున్నాడు.ఇందులో అంతర్లీనంగా ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పినా..దాని చుట్టూ కామెడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.స్లోగా స్టార్టయినా సంపత్ రాకతో మూవీ ఊపందుకుటుంది.నితిన్ ,సంపత్ ల మధ్య సీన్లు బాగా పండాయి.అలాగే నితిన్,రష్మిక ల లవ్ సీన్లు కూడా ఎంటర్ టైన్ చేస్తాయి. ఆ తర్వాత వెన్నెల కిషోర్,రఘుబాబుల సీన్లు నవ్విస్తాయి.అయితే సెకండాఫ్ కి వచ్చాక ఇలాంటి కామెడీ పంచ్ లు ఎక్కువయ్యే సరికి మొనాటినీ వస్తుంది. కథ చాలా చిన్నది కావడంతో ఈ సమస్య వచ్చింది.రొటీన్ ముగింపే అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తారు కాబట్టి తొందరగా ముగించేయాల్సింది. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ వీక్ గా ఉన్నాయి. ఛలో తర్వాత డైరెక్టర్ వెంకీ కుడుముల మరోసారి తన ప్రతిభను చాటాడు.కామెడీ సీన్లు,పంచ్ డైలాగులతో ఆకట్టుకున్నాడు.ఓవరాల్ గా ‘భీష్మ’’ ను ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.