రామచంద్రాపురంలో బీహెచ్ఈఎల్‌‌ గేట్లు మూసివేత

రామచంద్రాపురంలో బీహెచ్ఈఎల్‌‌ గేట్లు మూసివేత

రామచంద్రాపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్‌‌ఈఎల్‌‌ గేట్లను మూసివేసింది. రక్షణ చర్యల్లో భాగంగా బీహెచ్‌‌ఈఎల్‌‌ టౌన్‌‌షిప్‌‌కు అనుసంధానంగా ఉన్న వివిధ గేట్ల సమయ వేళలను తగ్గిస్తూ శుక్రవారం సర్క్యులర్‌‌ జారీ చేసింది. బీహెచ్‌‌ఈఎల్‌‌ మెయిన్‌‌ గేట్‌‌ రాత్రి 11.30 గంట నుంచి ఉదయం ఐదు గంటల వరకు పూర్తిగా క్లోజ్‌‌ చేయనున్నారు. అలాగే హెచ్‌‌ఐజీ, ఎల్‌‌ఐజీ, ఎంఐజీ గేట్లను ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు మూసి వేయనున్నారు.

సీఐఎస్‌‌ఎఫ్‌‌ బ్యారక్‌‌రోడ్డు, మ్యాక్‌‌ సొసైటీ, బుధవారం సంత రోడ్డు, శ్రీనివాస్‌‌ థియేటర్‌‌ గేట్లను తదుపరి ఆర్డర్లు వచ్చే వరకు పూర్తిగా మూసివేయనున్నారు. హెచ్‌‌ఐజీ సుందరవనం పార్క్‌‌ గేట్‌‌ మాత్రం తెరిచే ఉంటుందని ఆఫీసర్లు సర్క్యులర్‌‌లో పేర్కొన్నారు. అంబులెన్స్‌‌లు, ఎమర్జెన్సీ సర్వీస్‌‌లకు మాత్రం అనుమతి ఉంటుందని, సెక్యూరిటీకి అందరూ సహకరించాలని యాజమాన్యం కోరింది. ఈ రూల్స్‌‌ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది.