ఫార్మా సిటీ దగ్గరలో… వెంచర్లకు డిమాండ్​

ఫార్మా సిటీ దగ్గరలో… వెంచర్లకు డిమాండ్​
  • ఫార్మాసిటీ 10 కి.మీ. పరిధిలో డెవలప్ మెంట్ కు అవకాశం
  • యాదగిరిగుట్టలో పుంజుకుంటున్న రియల్ వ్యాపారం
  • ‘వెలుగు’తో శ్రీసాయిదీక్షిత డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ భీమ్ రాజ్

హైదరాబాద్, వెలుగు:

సిటీలో ఓపెన్ ప్లాట్లు, ఫామ్ ల్యాండ్ లకు డిమాండ్ భారీగా ఉంది. ధర తక్కువ ఉండీ, ఎక్కువ భూమి వచ్చే ప్రాంతాల వైపు రియల్ వ్యాపారం విస్తరిస్తోంది. సిటీ శివారు ప్రాంతాల్లో రియల్ వెంచర్లు, ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు వస్తుండగా, ప్రధానంగా మౌలిక వసతులు, సిటీకి చేరువలో ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఇష్టపడుతున్నారని.. ఈ క్రమంలోనే ముచ్చర్ల ఫార్మా సిటీకి దగ్గరగా, యాదాద్రికి అతి దగ్గరలో ఉండేలా కొత్త వెంచర్లను అందుబాటులోకి తెస్తున్నామని శ్రీసాయిదీక్షిత డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ భీమ్ రాజ్ ‘వెలుగు’తో చెప్పారు.

యాదగిరిగుట్టలో డీటీసీపీ లే అవుట్

యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ తో యాదగిరిగుట్ట పరిసరాల్లో రియల్ వ్యాపారం పుంజుకుంది. ముఖ్యంగా రెండేళ్ల పాటు ఇన్వెస్ట్ కోసం చూసేవారికి తక్కువ ధర, డీటీసీపీ నిబంధనలతో కూడిన ప్లాట్లను అందించడానికి మాసాయిపేట వద్ద 10 ఎకరాల్లో శ్రీనిలయం ప్రాజెక్టు మొదలుపెట్టాం.150 గజాల నుంచి ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ప్రతి ప్లాటుకు నల్లా కనెక్షన్ తో పాటు స్ట్రీట్ లైటింగ్, పార్క్ డెవలప్ మెంట్, ప్లాంటేషన్ తో వాస్తుకు అనుగుణంగా ప్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సైట్ లో గజం ధర రూ.6499 ఉండగా.. వచ్చే ఏడాదిలో టెంపుల్  ప్రారంభం అయితే ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా మరింత రద్దీగా మారుతుంది. భూములపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుంది.

ప్రకృతితో మమేకం.. ఫామ్ ల్యాండ్ తో సొంతం…

సిటీలో మారిన వాతావరణ పరిస్థితులతో సేద తీరేందుకు అనుకూలంగా, ఆహ్లాదకరంగా ఉండేలా కనీసం వారంతాల్లో కుటుంబంతో పూర్తి భద్రత ఉండే ప్రకృతిలో మమేకం అయ్యేలా ఫామ్ ల్యాండ్ వైపు జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ కి అందుబాటులో, ఓఆర్ఆర్ కు ఆనుకుని ముచ్చర్ల ఫార్మా సిటీ రానుంది. పరిశ్రమల్లో కార్యకలాపాలు మొదలైతే నివాసానికి తగినట్లుగా అన్ని వసతులు వస్తాయి. ఒకప్పుడు సిటీకి దూరంగా ఉండే ఇబ్రహీంపట్నం ఎప్పుడో సిటీలో కలిసింది.

పదుల సంఖ్యలో మాల్స్, మల్టిప్లెక్సులు అందుబాటులోకి వస్తున్నాయి. గజానికి రూ.2800 లకు ఫామ్ ల్యాండ్ సైట్లను అన్ని వసతులకు అనుగుణంగా నిబంధనలకు లోబడి ఉండేలా తీర్చిదిద్దాం. జామ, మామిడి, నిమ్మ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్ల మొక్కలు పెంచుతున్నాం. రెండేళ్ల వరకు ఎలాంటి నిర్వహణ అవసరం లేకుండా అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ లైటింగ్, ఫెన్సింగ్, వాటర్ ఫెసిలిటీ, మెటల్ రోడ్లు వంటి వసతులతో రూపొందించిన నంది హిల్స్ ఫామ్ ల్యాండ్ అందుబాటులో ఉన్నాయి.

ఆకర్షిస్తున్న ఫార్మా సిటీ

నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఫార్మా సిటీ రియల్ పెట్టుబడులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతం నుండి 10 కి.మీ పరిధిలో భారీ స్థాయిలో వెంచర్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్ మెంట్ నిర్మాణాలూ వచ్చే ఏడాదిలో మరింత  జోరుగా సాగుతాయి. భవిష్యత్ పెట్టుబడి కోసం ముచ్చర్ల, యాచారం, సాగర్ రోడ్, కందుకూరు రోడ్ , నంది వనపర్తి వంటి ఏరియాల్లో భారీ డిమాండ్ పెరుగుతోంది.

మూడేళ్లలోపే డబుల్

సిటీ లో పెరిగిన రద్దీ, అధిక ధరల కారణంగా శివారు ప్రాంతాల వరకు రియల్ వ్యాపారం విస్తరిస్తోంది. దీనికి తోడు ఓఆర్ఆర్ చుట్టూ పెరుగుతున్న వాణిజ్య, వ్యాపారాలతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఈ కారణంతోనే హైదరాబాద్ సిటీ తరహాలో శివారుల్లోనూ మౌలిక వసతులు, రోడ్లు, అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా స్కూల్, కాలేజీలు, ఆసుపత్రులు, ఎంటర్ టైన్మెంట్ జోన్లు,  కంపెనీలు విస్తరించడంతో చిన్న, మధ్య  తరగతికి చెందినవారికి అనువుగా ఉండేలా తక్కువ ధరలో ఉండే ఓపెన్ ప్లాట్లు అభివృద్ది చేస్తున్నాం.

ఇబ్రహీంపట్నం మండలం, యాచారం నుంచి నంది వనపర్తికి చేరువలో ఫామ్ ల్యాండ్ డెవలప్ చేస్తున్నాం, యాదాద్రికి చేరువలో డీటీసీపీ లేఅవుట్ మొదలు పెట్టాం. ఈ రెండు ప్రాంతాల్లో భూములకు డిమాండ్ పెరుగుతోంది. గత రెండేళ్లతో పోల్చితే దాదాపు 50 శాతం మేర భూమి ధర పెరగగా, మూడేళ్ల లోపే పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది.

Bhim Raj, Managing Director of SriSaidiksiddha Developers, says new ventures are being made available in close proximity to Yadadri