
భోజ్‌పురి డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారీ మృతి చందారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఓ హోటల్‌లో బస చేసిన ఆయన ఉదయానికి శవమై కనిపించారు. ఈ ఘటనతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అందరితో కలిసి ఓ హోటల్‌లో దిగారు డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారీ.
ఉదయం షూటింగ్ సమయం అవుతున్నా అయన రూమ్ నుండి బయటకు రాలేదు. మూవీ టీం బయటనుండి ఎంత పిలిచినా స్పందించికపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే తివారీ మృతిచెందారు. అయితే ఆయన ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారు అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.