
కమీషన్ల కోసమే సచివాలయ నిర్మాణం అని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. కమీషన్ల బతుకు కోమటిరెడ్డిదే. గతంలో సీఎంల దగ్గర ప్రాజెక్టులు తెచ్చుకుని కమీషన్లు బొక్కిన చరిత్ర కోమటిరెడ్డిదన్నారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు ఎంపీ కోమటి రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇపుడు విమర్శించిన వారే కట్టడాలు పూర్తయిన తర్వాత వాటి ముందు ఫోటోలు దిగడం ఖాయమని, ముంబైలో శివాజీ విగ్రహం, గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహాల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు తెలంగాణకు కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టాలనుకుంటే విమర్శించడం హాస్యాస్పదమన్నారు. అప్పులు చేయడం అత్యంత సహజం. అప్పులు చేసినా 68 శాతం మౌలిక రంగాలపైనే తెలంగాణ వెచ్చిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎకరాకు అయ్యే ఖర్చు రెండు పంటల్లోనే వస్తుంది. అవగాహనలేని వారే కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తారని తెలిపారు. తెలంగాణ మిషన్ భగీరథను చూసే కేంద్రం జలశక్తి శాఖ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని తెలిపారు బూర.