Actress Death: ఆ హీరోయిన్ చనిపోయి 3 వారాలు.. ఇప్పుడు గుర్తించిన పోలీసులు..

Actress Death: ఆ హీరోయిన్ చనిపోయి 3 వారాలు.. ఇప్పుడు గుర్తించిన పోలీసులు..

పాకిస్తానీ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (32) అనుమానాస్పదంగా మృతిచెందింది. నటి హుమైరా అస్గర్ అలీ, మరణించిన వారాల తర్వాత మృతదేహం లభ్యమైంది. తన కరాచీ అపార్ట్‌మెంట్‌లో వింత వాసన వస్తుందని పొరుగువారు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెంటనే, ఫోరెన్సిక్ బృందాలను ఆ ఫ్లాట్కు పంపించి ఆధారాలు సేకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్కు తరలించారు. నటి హుమైరా మరణంపై పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. 'తమాషా ఘర్' మరియు 'జలైబీ' చిత్రాలలో తన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

నేషనల్ మీడియా ప్రకారం,

హుమైరా అస్గర్ అలీ మరణించిన దాదాపు మూడు వారాల తర్వాత ఈ విషయం బయటకొచ్చింది. మంగళవారం (జూలై 8న) కరాచీలోని డిఫెన్స్ ఏరియాలోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించింది. గత కొన్ని సంవత్సరాలుగా హుమైరా అస్గర్ అలీ తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె అపార్ట్‌మెంట్ నుండి దుర్వాసన వస్తున్నట్లు గ్రహించిన ఆమె పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. నటి ఇంటికి వెళ్లి చూడగా.. ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. నటి అలీ నేలపై చనిపోయి కనిపించారు.

ALSO READ | Alia Bhatt: ఆలియా భ‌ట్‌ సంతకం ఫోర్జరీ.. రూ.77 లక్షలు కొట్టేసిన మాజీ అసిస్టెంట్‌

అయితే, చాలా కాలంగా నటిని చూడలేదని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో నటి హుమైరా అస్గర్ అలీ మరణం మీద అనుమానం పెరిగింది. ఈ క్రమంలో నటి చావు వెనుకున్న కారణాలు ఏంటనేది అన్ని కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు. 15 నుండి 20 రోజుల ముందే ఆమె మరణించిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు.