Alia Bhatt: ఆలియా భ‌ట్‌ సంతకం ఫోర్జరీ.. రూ.77 లక్షలు కొట్టేసిన మాజీ అసిస్టెంట్‌

Alia Bhatt: ఆలియా భ‌ట్‌ సంతకం ఫోర్జరీ.. రూ.77 లక్షలు కొట్టేసిన మాజీ అసిస్టెంట్‌

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్‌కు చెందిన ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ వేదికా ప్ర‌కాశ్ శెట్టిని జుహు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలియా భట్ నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఖాతాల నుండి రూ.77 ల‌క్షలు కాజేసిన‌ట్లు తేలింది.

వేదికా ప్రకాశ్ శెట్టి 2021 నుంచి 2024 వరకు నాలుగేళ్ల పాటు ఆలియా భట్ పీఏగా విధులు నిర్వర్తించింది. ఆలియాకు చెందిన ఫైనాన్షియ‌ల్ డాక్యుమెంట్లు,పేమెంట్లు, షెడ్యూల్ ప్లానింగ్ వేదికా శెట్టి చూసుకుంది. ఈ క్రమంలోనే న‌కిలీ బిల్లులు సృష్టించి, ఆలియా భ‌ట్ సంత‌కం తీసుకుని డ‌బ్బును కాజేసినట్లు పోలీసులు తమ ద‌ర్యాప్తులో తేల్చారు. ట్రావెల్‌, మీటింగ్‌లు, ఇత‌ర నిర్వ‌హ‌ణ కోసం ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు ఆమె చెప్పేద‌ని పోలీసులు వెల్ల‌డించారు.

దాంతో ఆమెపై చీటింగ్ మరియు ఫోర్జరీ కేసు నమోదు చేసి, బెంగళూరులోని జుహు పోలీసులు మంగళవారం (జూలై 8న) అరెస్టు చేశారు. ఆ తర్వాత వేదికా ప్ర‌కాశ్ శెట్టిని బాంద్రా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా, కోర్టు ఆమెను గురువారం వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

ALSO READ : సాయిపల్లవికి నవంబర్‌‌‌‌‌‌‌‌ నెల కలిసొస్తుందా..?

అసలేమైందంటే:

అలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదికా శెట్టిని ముంబైలోని జుహు పోలీసులు అరెస్టు చేశారు. భట్ నిర్మాణ సంస్థల నుండి రూ.77 లక్షల మోసం చేశారనే ఆరోపణలపై ఆమె తల్లి సోని రజ్దాన్ (2025జ‌న‌వ‌రి 23న) జూహూ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. FIR నమోదు చేసిన దాదాపు ఐదు నెలల తర్వాత బెంగళూరులో వేదికా శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. జూలై 8న ఆమెను కోర్టులో హాజరుపరిచగా, అక్కడ ఆమెకు జూలై 10 వరకు పోలీసు కస్టడీ విధించారు.

వేదిక ప్రకాష్ శెట్టిపై జుహు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 316(4) మరియు 318(4) కింద కేసు నమోదు చేశారు. అయితే, 2021 నుంచి 2024 వ‌ర‌కు వేదికా శెట్టి న‌టి ఆలియాకు చెందిన ఫైనాన్షియ‌ల్ డాక్యుమెంట్లు, పేమెంట్లు, షెడ్యూల్ ప్లానింగ్ చూసుకుంది.

ఈ క్రమంలోనే న‌కిలీ బిల్లులు సృష్టించి ఆలియా భ‌ట్ సంత‌కం తీసుకుని డ‌బ్బును కాజేసినట్లు పోలీసులు తమ ద‌ర్యాప్తులో తేల్చారు. ట్రావెల్‌, మీటింగ్‌లు, ఇత‌ర నిర్వ‌హ‌ణ కోసం ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు ఆమె చెప్పేద‌ని పోలీసులు వెల్ల‌డించారు.

ఆలియా నిర్మించిన ఫస్ట్ మూవీ డార్లింగ్స్, దీనిని షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. ఇందులో అలియా భట్ విజయ్ వర్మ మరియు షెఫాలీ షాతో కలిసి నటించారు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.