ఇండియా-పాకిస్తాన్ యుద్ధం: దేశం కంటే ఏదీ ఎక్కువ కాదంటూ.. మూవీ థియేటర్ రిలీజ్ క్యాన్సల్

ఇండియా-పాకిస్తాన్ యుద్ధం: దేశం కంటే ఏదీ ఎక్కువ కాదంటూ.. మూవీ థియేటర్ రిలీజ్ క్యాన్సల్

‘భలే మంచిరోజు’ అంటూ పదేళ్ల క్రితం టాలీవుడ్‌‌కు పరిచయమైంది వామికా గబ్బి. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తెలుగు ప్రేక్షకులకు దూరమైంది వామిక. హిందీ, పంజాబీ, తమిళ, మలయాళ భాషల్లో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంది.

ప్రస్తుతం అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ ‘భూల్ చుక్ మాఫ్’. ఈ సినిమా ఈరోజు(MAY9) థియేటర్స్‌‌లో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను, సెక్యూరిటీ రీజన్స్‌‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని థియేటర్స్‌‌లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మే 16న ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ అవుతోందని అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను థియేటర్స్‌‌లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేసినా.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదంటూ ఓ నోట్‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మూవీ టీమ్. రాజ్‌‌కుమార్ రావ్‌‌ హీరోగా క‌‌ర‌‌ణ్ శ‌‌ర్మ ద‌‌ర్శక‌‌త్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

సీమా పహ్వా, రఘుబీర్ యాదవ్, సంజయ్ మిశ్రా, జాకీర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు. మాడొక్ ఫిలింస్ బ్యానర్‌‌‌‌పై దినేష్​ విజన్ నిర్మించారు. తనిష్క్ బాగ్చి సంగీతం అందించాడు.  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.