పరమపద సోపానం సినిమా నుంచి భూమ్ భూమ్ సాంగ్ రిలీజ్..

పరమపద సోపానం సినిమా నుంచి భూమ్ భూమ్ సాంగ్ రిలీజ్..

‘బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా పూరి జగన్నాధ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పరమపద సోపానం’.  జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ఎస్.ఎస్.మీడియా బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇప్పటికే మొదటి పాటను విడుదల చేయగా, శుక్రవారం సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

‘భూమ్ భూమ్’ అంటూ సాగే ఈ పెప్పీ మాస్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘ఈగల్’ ఫేమ్ డేవ్ జాండ్ కంపోజ్ చేయగా, రాంబాబు గోసాల క్యాచీ లిరిక్స్ అందించాడు. ‘బెజవాడ బండెక్కి పొద్దున్నే దిగిపోయా.. ముద్దుల్లో ముంచెత్తా ఇప్పుడే.. భీమారం బస్సెక్కి రాత్రికే వెళ్లిపోతా ఈలోపు మీ దిమ్మ తిరుగుడే’ అంటూ   గీతా మాధురి పాడిన విధానం ఆకట్టుకుంది. జులై 11న సినిమా విడుదల కానుంది.