పేదలకు మెరుగైన వైద్యం కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు

పేదలకు మెరుగైన వైద్యం కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు

హైదరాబాద్ : పేద ప్రజలకు అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందులో భాగంగానే నగర శివార్లలో మూడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. అల్వాల్తో పాటు పరిసర ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు నిర్మించనున్న వెయ్యి పడకల హాస్పిటల్ కు ఈ నెల 26న భూమి పూజ చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ఆస్పత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రూ.897 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరీ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.