భోపాల్ గ్యాస్ ట్రాజెడీ.. సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ

భోపాల్ గ్యాస్ ట్రాజెడీ.. సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ

ప్రపంచంలో జరిగిన భారీ పారిశ్రామిక విపత్తులో ఒకటిగా పేరుపొందిన భోపాల్ గ్యాస్ లీక్ (1984) ప్రమాదంలో 3000 మందికి పైగా మరణించారు. ప్రమాదంలో మరణించినవాళ్లకు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ అదనపు నష్టపరిహారాన్ని  చెల్లించాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టిపడేసింది. నాలుగు దశాబ్దాల నాటి అంశాన్ని మళ్లీ ఇప్పుడు బయటికి లాగి దానిపై కేసులు నమోదు చేయడంపై ఉన్న హేతుబద్ధతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 

దీనికోసం యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సంస్థ 470 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఇవేకాకుండా ఆ సంస్థకు సంబంధించిన అనుబంద సంస్థలు కూడా అదనంగా రూ.7400 కోట్లు చెల్లించాలని పిటిషన్ లో పేర్కొంది. గతంలో జరిగిన సెటిల్‌మెంట్ టైంలో ప్రమాద తీవ్రతను సరిగా అంచనా వేయలేదని వాదించింది. దానికి సుప్రీం కోర్టు.. ‘ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సమస్యను తెరపైకి తీసుకురావడంపై కేంద్రం సరైన కారణం చూపలేదు. అంతేకాకుండా బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేయకుండా ఇంకా రూ. 50 కోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిరుపయోగంగా ఉన్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.’