ముందుజాగ్రత్త : కరెన్సీ నుంచి కరోనా కాటేస్తదేమో

ముందుజాగ్రత్త : కరెన్సీ నుంచి కరోనా కాటేస్తదేమో

కరెన్సీని ఇష్ట పడేవాళ్లు..ఇప్పుడు అదే కరెన్సీని ముట్టుకోవాలంటే భయపడుతున్నారు. కరోనా దెబ్బతో ఇతరుల నుంచి కరెన్సీ తీసుకోవాలంటే జడుసుకుంటున్నారు. ముఖ్యంగా తబ్లీగ్ జమాత్ ఇన్సిడెంట్ తరువాత దేశంలో కేసులు పెరగడం, పలు ప్రాంతాల్లో కరెన్సీ నోట్లకు ఉమ్మిని అంటించి వీధుల్లో వెదజల్లారంటూ వార్తలు వైరల్ అవ్వడం, మరి కొన్ని ప్రాంతాల్లో కరెన్సీ నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందని అనుమానాలు తలెత్తడంతో నోట్లు తీసుకునే విషయంలో జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పుడు పోలీసులు సైతం చలాన్లను వసూలు చేసే సమయంలో నోట్లకు శానిటైజ్ చేసి తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి చలాన్లు కట్టించుకుంటున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు ఇచ్చే కరెన్సీకి శానిటైజర్ అప్లయ్ చేసి తీసుకుంటున్నారు.

కరెన్సీ నోట్ల నుంచి కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారని, జాగ్రత్త వహిస్తే కరోనా నుంచి సురక్షితంగా ఉండవచ్చని భోపాల్ ఎస్పీ శైలేంద్ర సింగ్ తెలిపారు.