భీమారం మండలంలో భూభారతికి 2148 అప్లికేషన్లు

భీమారం మండలంలో భూభారతికి 2148 అప్లికేషన్లు
  • సాదాబైనామా దరఖాస్తులే 1010
  • భూ సమస్యల పరిష్కారం దిశగా 62 అప్లికేషన్లు
  • కుంటాల మండలంలో 667 దరఖాస్తులు
  • భూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

జైపూర్(భీమారం), వెలుగు: భూ సమస్యలు పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలాన్ని ఎంపిక చేసి ఈ నెల 5 నుంచి 16 వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే. 12 రెవెన్యూ గ్రామాలతోపాటు పాటు, తహసీల్దార్ ఆఫీసులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి మొత్తం 2148 అప్లికేషన్లు తీసుకున్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించిన భీమారంలో 414, ఆరేపల్లి 126, మద్దికల్​లో 187, కొత్తపల్లిలో 177 , అర్కపల్లిలో 55, పోతనపల్లిలో 56, బూరుగుపల్లిలో 381, పోలంపల్లిలో 133, అంకూశాపూర్​లో 139, దాంపూర్​లో 281, రెడ్డిపల్లిలో 124, వెల్లపల్లిలో 75 దరఖాస్తులు వచ్చాయి.  మొత్తం 2148 అప్లికేషన్లలో సాదాబైనామా అప్లికేషన్లే 1010 వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

111 అప్లికేషన్లు రిజెక్ట్.. 311 అప్లికేషన్లకు నోటీసులు

రెవెన్యూ సదస్సులు ముగిసి నాలుగు రోజులు కాగా బుధవారం నాటికి 311 అప్లికేషన్లకు నోటీసులిచ్చి, 111 అప్లికేషన్లను రిజెక్ట్ చేసినట్లు తహసీల్డార్​సదానందం పేర్కొన్నారు. భూ సమస్య పరిష్కారానికి 62 అప్లికేషన్లు రెడీ అయినట్లు చెప్పారు. మిగతాటిని కూడా భూమి మొఖాపై వెళ్లి ఎంక్వైరీ చేసి నిజమని తేలితే అప్లికెంట్ ఈకేవైసీ తీసుకొని అప్రూవల్ చేస్తామని తెలిపారు. బుధవారం తహసీల్దార్ ఆఫీస్​లో భూసమస్యల అప్లికేషన్లను కలెక్టర్ కుమార్​ దీపక్ ​పరిశీలించారు. భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్ సదానందంను ఆదేశించారు.

భూభారతిని సక్సెస్​ఫుల్​గా అమలు చేస్తాం

కుంటాల, వెలుగు: కుంటాల మండంలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కుంటాల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు.16 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో 667 భూ సమస్యల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్​ను స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో భూభారతిని సక్సెస్​ఫుల్​గా అమలు చేస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, తహసీల్దార్ కమల్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.