రోగనిర్ధారణలో సిటీ స్కాన్ ఎంతో ఉపయోగం : కలెక్టర్ రాహుల్ శర్మ

రోగనిర్ధారణలో సిటీ స్కాన్ ఎంతో ఉపయోగం : కలెక్టర్ రాహుల్ శర్మ
  • కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి రూరల్, వెలుగు : పేషెంట్​రోగనిర్ధారణను తెలుసుకునేందుకు సిటీ స్కాన్ ఎంతో ఉపయోగపడుతోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ ప్రతినిధులు.. సీఎస్ఆర్ నిధుల నుంచి ఆధునిక సిటీ స్కాన్ యంత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో  డైరెక్టర్ ప్రతీక్ కుమార్ చక్రవర్తి, డిప్యూటీ మేనేజర్లు డాక్టర్ పి.వేణుబాబు, సునీల్ కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.