‘ వెలుగు’ కథనానికి స్పందించిన భూపాలపల్లి కలెక్టర్​

‘ వెలుగు’  కథనానికి స్పందించిన భూపాలపల్లి కలెక్టర్​

భూపాలపల్లి అర్భన్, వెలుగు: గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా జయశంకర్​భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన వరద బాధితులకు తక్షణ సాయంగా అందజేస్తామన్న రూ. 10 వేలను రెండు రోజుల్లో ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ భవేష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం వెలుగు దినపత్రికలో  'వరద సాయం ఇంకా అందలే' హెడ్డింగ్​తో స్టోరీ పబ్లిష్​కాగా ఆయన స్పందించారు. మరో రెండు రోజులలో బాధితుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పలిమెల, మహాముత్తారం, టేకుమట్ల, మహాదేవపూర్, భూపాలపల్లి, మలహర్​రావు  మండలాల్లోని 4192 కుటుంబాలకు ఈ సాయం అందుతుందన్నారు.