జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రైస్ మిల్లర్లు వడ్ల దిగుమతుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేర్కొన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలం గోర్లవీడులోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఎస్పీ పరిశీలించారు. మిల్లులో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్ విధానం, రోజుకు ఎంత మేర వడ్లు స్వీకరిస్తున్నారనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆయనవెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, సీఐ నరేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
