ఎడ్యుకేషన్ హబ్గా భూపాలపల్లి : ఎంపీ కడియం కావ్య

ఎడ్యుకేషన్ హబ్గా భూపాలపల్లి : ఎంపీ కడియం కావ్య

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి ఎడ్యుకేషన్​హబ్​గా అభివృద్ధి చెందుతుందని దిశ కమిటీ చైర్మన్, వరంగల్​ ఎంపీ కడియం కావ్య అన్నారు. మంగళవారం జయశంకర్​భూపాలపల్లి కలెక్టరేట్ లో డిస్ర్టిక్ డెవలప్​మెంట్ కోఆర్డినేషన్​ అండ్​మానిటరింగ్ కమిటీ మీటింగ్​లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. 

వైద్య సేవలపై సమీక్షించి 45 శాతం ఆపరేషన్లు, 55 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. కు.ని. ఆపరేషన్లపై అవగహన కల్పించాలని సూచించారు. ఎన్సీడీ, డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ స్క్రీనింగ్ పకడ్బందీగా జరగాలని స్పష్టం చేశారు. వైద్య సేవల్లో జిల్లా రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు అభినందించారు. డయాలసిస్ సేవలు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో అందుబాటులోకి తేవాలని సూచించారు. 

భూపాలపల్లికి రైల్వేలైన్​ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. సింగరేణి, జెన్​కో సీఎస్ఆర్, డీఎంఎఫ్​టీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల మేరకు భూపాలపల్లి పరిసరాల్లో నిధులు వెచ్చించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్​ రాహుల్​శర్మ, అడిషనల్​ కలెక్టర్​అశోక్​కుమార్​ పాల్గొన్నారు.