మీ సవాల్ స్వీకరిస్తున్నా.. డేట్, టైమ్ ఫిక్స్ చేయండి

మీ సవాల్ స్వీకరిస్తున్నా.. డేట్, టైమ్ ఫిక్స్ చేయండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లుగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్  తెలిపారు.  రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి తాను సిద్ధమేనన్నారు.  ఈ మేరకు అమిత్ షా, భూపేష్ పేర్లతో ఉన్న సోఫాను  భూపేష్ బఘెల్  ట్వీట్ చేశారు.  టైమ్, డేట్, ప్లేస్ ఇంకా ప్రకటించలేదు.  కానీ పబ్లి్క్ ఇప్పటికే స్టేజ్ రెడీ చేశారు.  ప్లీజ్ టైమ్, డేట్ తెలపండి అంటూ భూపేష్  ట్వీట్ లో పేర్కొన్నారు.  

అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని పండరియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ  గత ఐదేళ్లలో మీరు చేసిన పని, గత 15 ఏళ్లలో ప్రధాని మోదీ చేసిన పనిపై బీజేపీతో చర్చించాలని హోంమంత్రి బఘేల్‌కు సవాలు విసిరారు. కేంద్ర హోంమంత్రి ఛాలెంజ్‌పై షాను బఘెల్ స్వీకరించడం ఇది రెండోసారి కావడం విశేషం.  
.
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు తొలి దశ పోలింగ్‌ జరుగుతోంది. నక్సల్స్ ప్రభావిత బస్తర్ డివిజన్‌తో సహా 20 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. రెండో దశ ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి.  సెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.