Bichagadu2 First Review: సీక్వెల్ వర్కౌట్ అయ్యిందా?

Bichagadu2 First  Review: సీక్వెల్ వర్కౌట్ అయ్యిందా?

తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. తమిళం నుండి తెలుగులోకి డబ్ ఐన ఈ మూవీ.. తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక దాదాపు 5 సంవత్సరాల తరువాత బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ రానుంది.

ఇప్పటికే చెన్నైలో కొన్ని ప్రాంతాలలో ప్రముఖులకు స్పెషల్ షోస్ వేసారు మేకర్స్. ఈ షోస్ నుండి వినిపిస్తున్న సమాచారాం మేరకు.. సినిమా చాలా బాగుందట. మూవీలో విజయ్ నటన అద్భుతమని అంటున్నారు. కథంతా ఒక బిజనెస్ మ్యాన్ చుట్టూ తిరుగుతుందట. అతనికి బ్రెయిన్ మార్చాల్సిన పరిస్థితి వస్తుందట. ఆ బ్రెయిన్ మార్చిన తరువాత ఎం జరిగింది? మధ్యలో హీరో బిచ్చగాడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? దానికి అతని చెల్లికి ఉన్న లీక్ ఏంటి? అనేది మిగిలిన కథ.

మొదటి పార్ట్ లో మదర్ సెంటిమెంట్ మీద ఫోకస్ పెట్టిన విజయ్.. సెకండ్ పార్ట్ లో సిస్టర్ సెంటిమెంట్ ను ఫీక్స్ లో చూపించాడట. ఈ నేథ్యంలో వచ్చే సీన్స్ హృదయానికి హత్తుకునేలా ఉంటాయట. ఈ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో విజయ్ మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. కలెక్షన్స్ లో కూడా ఈ సినిమా కొత్త ట్రెండ్ క్రియేట్ చేయనుందని సమాచారం. మొత్తంగా ఈ సినిమా ఎంత రేంజ్ వరకు వెళ్తుందా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.