
విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘బిచ్చగాడు2’. కావ్య థాపర్ హీరోయిన్. బికిలి ట్యాగ్‌లైన్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నాడు విజయ్. అయితే బికిలి అంటే అర్ధాన్ని వివరిస్తూ శుక్రవారం సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘పేద వాళ్లను బానిసలుగా మార్చి వేధిస్తున్న వారికి నేను పెట్టిన పేరే బికిలి’ అని చెప్పాడు విజయ్.
‘మనలో చాలా మంది ఎంతకష్టపడి పని చేసినా ముందుకెళ్లలేక పోతున్నారంటే ఈ బికిలిలే కారణం. వారిని మనం ఏం చేయలేకపోయినా.. బికిలి అని పిలవొచ్చు. ఈ రోజు నుంచి భారతదేశంలో ఈ పేరు వాడకంలోకి వస్తుంది’ అని చెబుతూ పాట మొదలుపెడతాడు. విజయ్ ఆంటోని సాంగ్ కంపోజ్ చేయగా, భాష్యశ్రీ లిరిక్స్ రాశారు.