సైకిళ్లను కొనుగోలు చేస్తున్న శ్రీలంక ప్రజలు

సైకిళ్లను కొనుగోలు చేస్తున్న శ్రీలంక ప్రజలు

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అక్కడి ఆర్ధిక స్థితి రోజు రోజుకు మరింత దిగజారిపోతుంది. సామాన్యుడు కొనలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కులనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు బండి తీయాలంటేనే జనం భయపడిపోతున్నారు. దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వాహనాలకు బదులు సైకిళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. దుకాణాల్లో సైకిళ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వీటినే కొనుగోలు చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కూడా వీటిపైనే వెళ్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ కొనుగోలు చేయలేమని..గంటల తరబడి క్యూలో నిల్చొలేమని చెబుతున్నారు. దేశంలోని చాలా మందికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా సైకిళ్లు మారాయని కొలంబోలోని ఓ కస్టమర్ చెప్పారు.