ఫెడరల్‌ జడ్జిగా భారత సంతతికి చెందిన సరళా విద్యా 

ఫెడరల్‌ జడ్జిగా భారత సంతతికి చెందిన సరళా విద్యా 

అమెరికాలో మరో భారత సంతతి పౌరురాలు, పౌర హక్కుల న్యాయవాది సరళా విద్యా నాగలను కీలక పదవికి అధ్యక్షుడు జో బైడెన్‌ సిఫార్సు చేశారు. కనెక్టికట్‌ రాష్ట్రానికి ఫెడరల్‌ జడ్జిగా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని సెనేట్‌ కన్ఫాం చేసింది. సరళా విద్యా నాగల నియామకం ఖరారైతే.. దక్షిణాసియాకు చెందిన తొలి ఫెడరల్‌ జడ్జి అవుతారు. సరళా ప్రస్తుతం కనెక్టికట్‌ జిల్లాలోని యుఎస్‌ అటార్నీ కార్యాయలంలో మేజర్‌ క్రైమ్స్‌ యూనిట్‌కు డిప్యూటీ చీఫ్‌గా  విధులు నిర్వహిస్తున్నారు. 2017 నుండి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

2012లో US అటార్నీ కార్యాలయంలో చేరిన సరళా విద్యా నాగల.. హేట్‌ క్రైమ్స్‌ కోఆర్డినేషన్‌ సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. 2008లో యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో బర్కిలీ స్కూల్‌ ఆఫ్‌లాలో జ్యూరిస్‌ డాక్టర్‌ డిగ్రీని పొందారు. 2009లో జడ్జి సుషాన్‌ గ్రాబేర్‌ దగ్గర క్లర్క్ గా పని చేశారు.