ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్ డోస్ చాలా ముఖ్యం

ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్ డోస్ చాలా ముఖ్యం

వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సూచించారు. టీకా తీసుకోని వారు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని, అప్పుడే కరోనా బారి నుంచి రక్షణ లభిస్తుందన్నారు. చలికాలంలో వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని బైడెన్ చెప్పారు. ఈ సమయంలో వ్యాక్సిన్ తీసుకోని వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని.. ఈ సీజన్ లో మరణాలు పెరిగే ఛాన్సులు ఉన్నాయని హెచ్చరించారు. 

టీకా వేయించుకోని వారు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ పూర్తయిన వారు బూస్టర్ డోసు వేయించుకోవాలని బైడెన్ విజ్ఞప్తి చేశారు. కలసికట్టుగా ఒమిక్రాన్ వేరియంట్ పై పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్ షాట్ తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. కాగా, అమెరికాలో దాదాపు 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించామని సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) బుధవారం పేర్కొంది. సీడీసీ డేటా ప్రకారం.. అగ్ర రాజ్యంలో ప్రతి రోజూ సగటున 1,150 కొవిడ్ మరణాలు నమోదవుతున్నాయి. 

మరిన్ని వార్తల కోసం: 

బిర్యానీ కోసం వెళ్లి మృతి

దీపిక కోసం ప్రభాస్ భారీ లంచ్‌‌‌‌‌‌‌‌

టైటిల్ కోసం 450 రోజులు సముద్రంలో జర్నీ