ఈ బుడతడు నా యాంకరింగ్‌ సీటును కొట్టేసేలా ఉన్నాడు

ఈ బుడతడు నా యాంకరింగ్‌ సీటును కొట్టేసేలా ఉన్నాడు

బాలీవుడ్ సీనియర్ యాక్టర్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి 12లో ప్రస్తుతం స్టూడెంట్ స్పెషల్ నడుస్తోంది. ఈ స్టూడెంట్ స్పెషల్‌కు మొట్టమొదటి కంటెస్టెంట్‌గా గుజరాత్‌లోని భరూచ్‌కు చెందిన 14 ఏళ్ల అన్మోల్ శాస్త్రి వచ్చాడు. అన్మోల్ టాలెంట్ చూసి ముచ్చటపడిన అమితాబ్.. ఈ బాలుడు నా హోస్ట్ సీట్‌కే ఎసరు పెట్టేలా ఉన్నాడని అన్నారు. అమితాబ్‌ను కలవడం పట్ల ఎంతో సంతోషంగానూ మరియు ఉత్సాహంగానూ ఉందని అన్మోల్ అన్నాడు. తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత.. తనకు మూడు కోరికలున్నాయని అన్మోల్ తెలిపాడు. మొదటది నోబెల్ బహుమతిని గెలుచుకోవాలని.. రెండవది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదగాలని.. మరియు మూడవది ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావడం అని అన్మోల్ తెలిపాడు. ఏపీజే అబ్దుల్ కలాం మరియు స్టీఫెన్ హాకింగ్‌లిద్దరు తన అభిమాన శాస్త్రవేత్తలని అన్మోల్ తెలిపాడు. తాను కేబీసీలో డబ్బు గెలిస్తే.. దాంతో టెలిస్కోప్ కొనాలనుకుంటున్నానని అన్మోల్ వెల్లడించాడు.

బిగ్ బీ ఈ బాలుడికి ‘జిగ్యసు’అని ముద్దు పేరు పెట్టారు. అన్మోల్ కొంటెతనం మరియు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని బిగ్ బీ ఇష్టపడ్డారు. ఈ ఏజ్‌లోనే నువ్వు ప్రొఫెసర్‌గా ఉన్నావని అన్మోల్‌ను బిగ్ బీ ఆటపట్టించాడు.

ఆటలో భాగంగా 20,000 పాయింట్ల ప్రశ్నకు అన్మోల్ చెప్పిన సమాధానం విని బిగ్ బీ ఆశ్చర్యపోయాడు. కామిక్ పుస్తకాలలో, ఏ యువకుడిని రేడియోధార్మిక సాలీడు కరవడం వల్ల అతడు మానవాతీత బలం, వేగం మరియు గోడలకు అతుక్కునే సామర్థ్యాన్ని పొందుతాడు? అని అడిగి.. వాటికి నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. ఎ) పీటర్ పార్కర్ బి) బ్రూస్ వేన్ సి) టోనీ స్టార్క్ డి) స్టీవ్ రోజర్స్ అనే ఆప్షన్లు ఇవ్వగా.. అన్మోల్ ఠక్కున పీటర్ పార్కర్ అని కరెక్ట్ సమాధానం చెప్పాడు. దాంతో షాకైన అమితాబ్.. సూపర్ హీరోలుగా నటించిన ఇతర నటుల పేర్లు నీకు తెలుసా అని బిగ్ బి అడిగినప్పుడు, అన్మోల్ దానికి కూడా త్వరగానే సమాధానం ఇచ్చాడు. దాంతో ఆశ్చర్యపోయిన బిగ్ బీ.. ఈ బాలుడు తన హోస్ట్ సీట్ కొట్టేసేలా ఉన్నాడని చమత్కరించాడు.

అన్మోల్ తన రెండవ ప్రశ్నకే 50-50 లైఫ్‌లైన్‌ను ఉపయోగించాడు. ఆ తర్వాత 7వ ప్రశ్నకు 40,000 పాయింట్ల కోసం మరొక లైఫ్‌లైన్‌ను ఉపయోగించాడు. ఇక తన చేతిలో కేవలం ఒకే ఒక లైఫ్‌లైన్‌ మిగిలి ఉంది. దాన్ని కూడా అన్మోల్.. 25,00000 పాయింట్ల ప్రశ్న కోసం ఉపయోగించాడు. టెలిస్కోప్ సహాయంతో కనుగొనబడిన మొదటి గ్రహం ఏది? అనే ప్రశ్నకు ఎ) యురేనస్ బి) నెప్ట్యూన్ సి) సాటర్న్ డి) మార్స్ అనే ఆప్షన్లు ఇచ్చాడు. దానికి సరైన సమాధానం తెలియని అన్మోల్.. లైఫ్‌లైన్‌ను ఉపయోగించి యురేనస్ అని ఆన్సర్ చెప్పాడు. ఆ తర్వాత 50 లక్షల పాయింట్ల ప్రశ్నకు చేరుకున్నాడు. టెస్ట్, వన్డే క్రికెట్‌లో ఎక్కువసార్లు రన్ అవుట్ అయిన క్రికెటర్ ఎవరు? దీనికోసం ఎ)ఇంజామామ్-ఉల్-హక్ బి) రాహుల్ ద్రవిడ్ సి) సచిన్ టెండూల్కర్ డి) స్టీవ్ వా అనే ఆప్షన్లు ఇచ్చాడు. దీనికి సరైన సమాధానం స్టీవ్ వా. కానీ అన్మోల్‌కు ఈ ఆన్సర్ తెలియకపోవడంతో.. క్విట్ అవుతానని బిగ్ బీకి తెలిపాడు. దాంతో అన్మోల్ రూ. 25 లక్షలు తీసుకొని షో నుంచి వెనుదిరిగాడు.

For More News..

రాష్ట్రంలో చదువుకున్న మహిళలు 66.6 శాతం.. పురుషులు 84.8 శాతం