బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రోజు రోజుకు ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగుతోంది. అయితే ఎనిమిదో వారం ఎలిమినేషన్ వ్యవహారం ప్రేక్షకుల్లో, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ వారం ఎవరు హౌస్ వీడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఊహాగానాలు, లీకులు వైరల్ అవుతున్నాయి. ఈసారి ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండటంతో, ఫ్యాన్స్ ఓటింగ్‌లో రికార్డులు సృష్టించారు.
డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!
ఎనిమిదో వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో దివ్వెల మాధురి, తనూజ, సంజనా, రీతూ చౌదరీ, రాము రాథోడ్, కళ్యాణ్, డీమాన్ పవన్, గౌరవ్ గుప్తా ఉన్నారు. అయితే ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. టాప్ కంటెస్టెంట్స్‌కు , బాటమ్ కంటెస్టెంట్స్‌కు మధ్య ఓట్ల తేడా భారీగా ఉంది. చివరి రెండు స్థానాల్లో ఉన్న గౌరవ్ గుప్తా , దివ్వెల మాధురి మధ్య పోరు మాత్రం తీవ్రంగా ఉంది. వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం కొన్ని వేలు మాత్రమే ఉండటంతో, ఎలిమినేషన్ ఈ ఇద్దరి మధ్యనే ఉంటుందని స్పష్టమైంది.
అయితే కంటెంట్ అందించడంలో, టాస్క్‌లలో చురుకుగా పాల్గొనడంలో మాధురితో పోలిస్తే గౌరవ్ గుప్తా వెనుకబడ్డారు. ముఖ్యంగా, భాషా సమస్య కారణంగా గౌరవ్ ఇతర హౌస్‌మేట్స్‌తో కలవలేకపోతున్నారు. ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించలేకపోవడం మైనస్‌గా మారింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న బిగ్ బాస్ టీమ్ ఈ వారం గౌరవ్ గుప్తాను ఎలిమినేట్ చేసేందుకు మొగ్గు చూపినట్లుగా సమాచారం. షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు కూడా తెలుస్తోంది.
తనూజ నిర్ణయం మాధురిని రక్షించిందా?
ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో అసలైన ట్విస్ట్ ఏంటంటే... హౌస్‌మేట్ తనూజ వద్ద ఉన్న "డైమండ్ పవర్. ఈ అరుదైన పవర్‌ని ఉపయోగించి ఆమె నామినేషన్స్‌లో ఉన్న ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది. గౌరవ్ గుప్తా, దివ్వెల మాధురి ఎలిమినేషన్ అంచున నిలబడినప్పుడు, హోస్ట్ నాగార్జున తనూజను తన పవర్‌ని ఉపయోగించమని కోరగా... తనూజ అందరి అంచనాలకు భిన్నంగా పాత స్నేహాన్ని గుర్తు చేసుకుని దివ్వెల మాధురిని సేవ్ చేసేందుకు ఆ పవర్‌ని వాడినట్లుగా లీకులు వస్తున్నాయి. ఈ పవర్ ఉపయోగం వల్ల మాధురి సేఫ్ జోన్‌లోకి వెళ్లగా, ఆటోమేటిక్‌గా లీస్ట్ ఓట్స్‌లో ఉన్న గౌరవ్ గుప్తా ఎలిమినేషన్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారనుంది.
నో ఎలిమినేషన్ ఛాన్స్?
ఇంత జరుగుతున్నా, ఈ వారం ఎలిమినేషన్ లేకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ వారం హౌస్ లోకి భరణి, శ్రీజ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో శ్రీజ వెనుకబడటంతో హౌస్ నుంచి అనూహ్యంగా వెళ్లిపోవాల్సి వచ్చింది. కాబట్టి, ఈ వారం గౌరవ్ గుప్తాను కూడా 'సీక్రెట్ రూమ్'కు పంపడం లేదా అసలు ఎలిమినేషన్ ప్రకటించకపోవడం వంటి డబుల్ ధమాకా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి.
