ఫోన్ ట్యాపింగ్​ వెనక పెద్దోళ్లు ఉన్నరు : కూనంనేని

ఫోన్ ట్యాపింగ్​ వెనక పెద్దోళ్లు ఉన్నరు : కూనంనేని

 హైదరాబాద్,వెలుగు: ఫోన్ ట్యాపింగ్ పోలీసులు సొంతంగా చేసింది కాదని, దీని వెనక పెద్దళ్లోనున్నారని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని  ఒక ప్రకటనలో తెలిపారు. 

రాష్ట్రంలోని ప్రముఖుల ఫోన్​లను రికార్డు చేశారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ట్యాపింగ్​తో ప్రత్యర్థి పార్టీలు ఏ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినా లీడర్లను రాత్రికి రాత్రే అరెస్టు చేసేవారని గుర్తు చేశారు. ట్యాపింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.