
హైదరాబాద్, వెలుగు: మొబైల్ఫోన్ల రిటెయిల్ చెయిన్ నిర్వహిస్తున్న బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబుతో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. తమ 19 ఏళ్ల జర్నీలో మొదటిసారిగా ఒక సూపర్‌స్టార్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్నట్లు బిగ్ సి ఎండీ బాలు చౌదరి వెల్లడించారు. ఇప్పటిదాకా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలోనే 250 రిటెయిల్ స్టోర్లను ఏర్పాటు చేశామని, రాబోయే రెండేళ్లలో ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తామని, స్టోర్ల సంఖ్యను 500లకు చేర్చుతామన్నారు. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని, బిగ్ సిలో ప్రస్తుతం 2 వేల మంది ఉద్యోగులున్నారని చెప్పారు. 2021–22 ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 1000–1100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా దూసుకెళ్తున్నామని, 2023–24 నాటికి ఉద్యోగుల సంఖ్యను 4 వేలకు పెంచాలని, అలాగే రూ. 2000 కోట్ల టర్నోవర్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్ టీవీల విక్రయంలోకి ఇప్పటికే అడుగుపెట్టామని, త్వరలో లాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లనూ అమ్ముతామని చెప్పారు. 5 జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఐఓటీ డివైజ్‌ల సేల్స్ ఊపందుకుంటాయని, ఆ దిశలో చొరవ తీసుకుంటున్నామని బాలు చౌదరి అన్నారు. కస్టమర్లు ఏడాదిలోపే కొత్త ఫోన్‌వైపు చూస్తున్నారని, దీంతో తమ ఏవరేజ్ సెల్లింగ్ రేటు గతంలోని రూ. 12 వేల నుంచి ఇప్పుడు రూ. 16 వేలకు పెరిగిందని చెప్పారు.