సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట .. సిట్ దర్యాప్తుకు లైన్ క్లియర్

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట ..  సిట్ దర్యాప్తుకు లైన్ క్లియర్

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.  ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయిడు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన  సిట్ కు లైన్ క్లియర్ అయింది.  ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను అత్యున్నత న్యాయస్థానం  కొట్టివేసింది. జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ  తీర్పును వెలువరించింది. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తి్ంచింది ఏపీ ప్రభుత్వం . ఈ క్రమంలో సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే  సిట్ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో ఆ స్టేను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం..  ఆ స్టేను ఎత్తివేసింది.  ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా, దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటని విచారణ సందర్భంగా  సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని, ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో  స్టే అవసరం లేదని పేర్కొంది. దీంతో సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది.