వరద సాయంలో అతిపెద్ద కుంభకోణం తెలంగాణలోనే

వరద సాయంలో అతిపెద్ద కుంభకోణం తెలంగాణలోనే

హైదరాబాద్ : వరద సాయంలో అతిపెద్ద కుంభకోణం తెలంగాణలోనే జరిగిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద సాయం పేరుతో TRS నేతలకు ప్రభుత్వ డబ్బిచ్చి పంచుతున్నారన్నారు. ఆడబ్బులకు ఎలాంటి లెక్కా, పత్రం లేకుండా పోయిందన్నారు. నిత్యవసరాలకు 50వేలివ్వాలని చెప్తే… పదివేల రూపాయలు బిచ్చమేస్తున్నారన్నారు. ఆపదివేలలో కూడా 5వేలు TRS వాళ్లే నొక్కేస్తున్నారని ఫైరయ్యారు ఉత్తమ్. GHMC ఎన్నికలున్నాయనే డబ్బులు పంచుతున్నారన్నారు.

సర్కార్ ప్రకటించిన రూ. 550 కోట్లలో రూ. 387 కోట్లు క్యాష్ పంచారని..చెక్ రూపంలో ఇవ్వాల్సిందన్నారు. చేతికి డబ్బులు ఇవ్వడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు చేతివాటం చూపించారని తెలిపారు. వరద బాధితులకు ఇవ్వకుండా TRS నేతలు పంచుకున్నారని..నిజమైన లబ్ధి దారులకు సహాయం అందలేదన్నారు. GHMC ఎన్నికల వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ గా డబ్బులు ఇస్తున్నారని..విచారణ చేపట్టాలని శుక్రవారం గవర్నర్ తమిళిసైని కోరారు ఉత్తమ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.