అహ్మదాబాద్ విమాన ప్రమాదం..డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) దొరికింది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం..డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) దొరికింది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానశకలాలనుంచి ఒక బ్లాక్ బాక్స్ను డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ కూలిపోయిన బీజే ఆస్పత్రి సమపీంలో దర్యాప్తులో పాల్గొన్న ATS అధికారి డీవీఆర్ ను కనుగొన్నారు. డీవీఆర్ లభ్యం కావడంతో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. అయితే మిగతా బ్లాక్ బాక్స్ దొరికితే దర్యాప్తు మరింత ముందుకు సాగుతుంది. 

ఎయిరిండియా బోయింగ్  787–8 డ్రీమ్ లైనర్  విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్  కీలకం. పైలట్ల సమాచారం, విమానం టెక్నికల్ సమాచారం అంతా బ్లాక్ బాక్స్ లోనే రికార్డు కావడంతో తదుపరి దర్యాప్తులో బ్లాక్ బాక్సుల పాత్ర కీలకంగా మారింది.

అసలేంటీ బ్లాక్ బాక్స్?

ఒక విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలు, సంఘటనల గురించి సెకండ్ టు సెకండ్  ఇన్ఫర్మేషన్ ను బ్లాక్ బాక్సులు రికార్డు చేస్తాయి. సాధారణంగా ప్రతి కమర్షియల్  ఫ్లైట్ లో రెండు బ్లాక్ బాక్సులు ఉంటాయి. ఆరెంజ్  కలర్ లో ఉండే ఇవి క్రాష్  రెసిస్టెంట్లు. అంటే విమానం ఎలాంటి ప్రమాదానికి గురైనా బ్లాక్ బాక్సులు మాత్రం చెక్కు చెదరవు. ఆవిధంగా వాటిని తయారు చేస్తారు. పేలుడు, అగ్నిప్రమాదం, వాటర్  ప్రెజర్, హైస్పీడ్  క్రాషెస్  వంటి వాటిని ఇవి తట్టుకుంటాయి. తాజాగా ప్రమాదానికి గురైన బోయింగ్ 787 వంటి ఆధునిక విమానాల బ్లాక్ బాక్సుల్లో ప్రతి సమాచారం రికార్డవుతుంది. 

►ALSO READ | ఏ లక్కీ నెంబర్ అయితే ముఖ్యమంత్రిని చేసిందో.. అదే లక్కీ నెంబర్ రోజే ప్రాణాలు పోయాయి!

కాక్పిట్ కమాండ్ ఇన్పుట్స్  నుంచి ఎయిర్ కండిషనింగ్  సిస్టమ్స్  వరకు వీటిలో డేటా నమోదవుతుంది. కాక్ పిట్ఆడియో పైలట్ సంభాషణ, రేడియో ట్రాన్స్ మిషన్స్, వార్నింగ్  అలార్మ్ వంటి సమాచారాన్ని కాక్ పిట్  వీడియో రికార్డర్  (సీవీఆర్) క్యాప్చర్  చేస్తుంది. విమానం ప్రమాదానికి గురవడానికి చివరి క్షణాల డేటా అంతా బ్లాక్ బాక్స్ లోనే రికార్డు అవడంతో దర్యాప్తులో ఈ డేటానే కీలకం అవుతుంది. 25 గంటల సమాచారాన్ని సీవీఆర్ లు స్టోర్  చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మేజర్  ఫ్లైట్ క్రాష్ కు గల కారణాలను తెలుసుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి.