
చాలా మంది ఫోన్లలో ట్రూకాలర్ (Truecaller) యాప్ ఉంటుంది. మీరు కూడా ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నారా... అయితే మీకో షాకింగ్ న్యూస్. సెప్టెంబర్ 30లోగ ట్రూకాలర్ యాప్లో కాల్ రికార్డింగ్ ఫీచర్ తీసేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కాలర్ ID అండ్ స్పామ్ బ్లాకింగ్ యాప్‌లో ఒకటి, రెండు కాదు మీకు ఉపయోగపడే చాల గొప్ప ఫీచర్లు ఉన్నాయి.
ట్రూకాలర్ iOS హెడ్ నకుల్ కబ్రా మాట్లాడుతూ లైవ్ కాలర్ ఐడి & ఆటోమేటిక్ స్పామ్ కాల్ బ్లాకింగ్ వంటి ఇతర ఫీచర్స్ పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నాం, అందుకే iOSలో కాల్ రికార్డింగ్ ఫీచర్ తొలగించాలని కంపెనీ నిర్ణయించిందని అన్నారు. జూన్ 2023లో తీసుకొచ్చిన ట్రూకాలర్ కాల్ రికార్డింగ్ ఫీచర్ మొదట్లో iPhoneలో పైడ్ కస్టమర్లకు మాత్రమే ఉండేది, కానీ తరువాత Android వాడే వారి కోసం కూడా తీసుకొచ్చింది. ఆపిల్ ఏ థర్డ్ పార్టీ యాప్‌ను కాల్స్ రికార్డ్ చేయడానికి అనుమతించదు.
రికార్డింగ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ: సోషల్ మీడియా యాప్ Xలో చాల మంది ట్రూకాలర్ యూజర్లు ఐఫోన్ ట్రూకాలర్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్ నిలిపివేస్తున్నాము అనే ఒక నోటిఫికేషన్‌ను షేర్ చేసారు. సెప్టెంబర్ 30 తర్వాత ప్రతిదీ తొలగిపోతుంది కాబట్టి ఈ ఫీచర్‌ను ఎక్కువగా ఉపయోగించే వారు కాల్ రికార్డింగ్‌లను కావాలనుకుంటే ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది.
ఐఫోన్‌లో ట్రూకాలర్ నుండి కాల్ రికార్డింగ్స్ సేవ్ చేయడానికి ఫోన్‌లో ట్రూకాలర్ యాప్ ఓపెన్ చేసి రికార్డ్ అప్షన్ కు వెళ్లండి. తర్వాత, సెట్టింగ్ ఐకాన్‌పై నొక్కండి అలాగే స్టోరేజ్ ప్రిఫరెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి దానిని ఐక్లౌడ్ స్టోరేజ్‌గా మార్చండి. ఈ ఆప్షన్ ఆఫ్ చేసి ఉంటే మీరు Settings > Name > iCloud > Saved in iCloud > Turn on Truecallerకి వెళ్లాలి. ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి ఇదొక్కటే మాన్యువల్ మార్గం.