ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. సీబీఐ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి కోర్టు సానుకూలంగా స్పందించింది. జైలులోనే ప్రశ్నించేందుకు అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. గతంలోనే తమ ఎదుట హాజరుకావాలని కవితకు సీబీఐ ఇవ్వగా ఆమె వెళ్లలేదు.
వచ్చే వారం కవితను తీహార్ జైలులోనే సీబీఐ ప్రశ్నించనుంది. సీబీఐ అధికారులు జైలులోకి లాప్ టాప్, స్టేషనరీ తీసుకు వెళ్ళేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు సూచించింది.
మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవితను విచారించాలని సీబీఐకి సూచించింది. బుచ్చిబాబు ఫోన్ లో దొరికిన సమాచారం ఆధారంగా కవితను సీబీఐ విచారించి ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేయనుంది. ఆప్ ఇచ్చిన రూ. 100 కోట్ల వ్యవహారంపై కూడా సీబీఐ ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది.