
అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించే ఐశ్వర్య రాజేశ్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నానితో చేసిన టక్ జగదీశ్ తర్వాత ఆమె మరో సినిమాలో కనిపించలేదు. అయితే, అన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుండటంపై తాజాగా ఈ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘కాక ముట్టై అనే తమిళ సినిమా చేస్తే ఇండస్ట్రీ మొత్తం నన్ను అభినందించింది. కానీ, ఆ తర్వా త రెండేళ్లు ఖాళీగా ఉన్నా. పరిశ్రమలో విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి వారు తప్ప మరే హీరో నాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు హీరోయిన్ అంటే డిజిటల్, ఓటీటీ, మార్కెట్ వ్యాల్యూ.. ఇలా అన్నీ చూసుకుని మరీ ఎంపిక చేసుకుంటున్నారు. అయినా, నేను బాధపడను.
నా సినిమాకు నేనే హీరో. నన్ను అభిమానించే ఫ్యాన్స్ నాకు ఉన్నారు’ అని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది.