సర్వీస్ రోడ్డుపై పడిన భారీ బండరాయి ... మంచిరేవుల నుంచి నార్సింగి వెళ్లే దారిలో ఘటన

సర్వీస్ రోడ్డుపై పడిన  భారీ బండరాయి ...  మంచిరేవుల నుంచి నార్సింగి వెళ్లే దారిలో ఘటన

గండిపేట, వెలుగు: కొన్ని రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంచిరేవుల నుంచి నార్సింగి వైపు వెళ్లే ఔటర్ రింగ్​రోడ్డు సర్వీస్ రోడ్డుపై గురువారం సాయంత్రం భారీ బండరాయి పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కొండచరియ పడిపోవడంతో స్థానిక వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసే వాహనదారులు జాగ్రత్తగా అధికారులు 
సూచించారు.