మరో క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె..

మరో క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె..

ఆమధ్య ప్రభాస్‌‌ సినిమా ‘స్పిరిట్‌‌’ నుంచి దీపిక పదుకొణె తప్పుకోవడం పెద్ద దుమారమే రేపింది. ఎనిమిది గంటలకు మించి పనిచేయనంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో విభేదిస్తూ  ఆ ప్రాజెక్ట్‌‌ నుంచి తప్పుకుంది.  అయితే తాజాగా మరో బిగ్‌‌ ప్రాజెక్ట్‌‌ నుంచి కూడా ఆమె తప్పుకుంది. అమితాబ్ బచ్చన్, దీపిక లీడ్ రోల్స్‌‌లో ‘ది ఇంటర్న్‌‌’ అనే అమెరికన్‌‌ కామెడీ డ్రామా హిందీలో రీమేక్‌‌ కావాల్సి ఉంది. తాజాగా ఈ రీమేక్‌‌ నుంచి ఆమె తప్పుకున్నట్టు సమాచారం. 

హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్​ వార్నర్‌‌‌‌ బ్రదర్స్‌‌తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ ‘క ప్రొడక్షన్స్‌‌’ బ్యానర్‌‌‌‌పై దీపిక ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఐదేళ్ల క్రితమే రిషికపూర్ లీడ్‌‌ రోల్‌‌లో ఆమె ఈ ప్రాజెక్ట్‌‌ను అనౌన్స్‌‌ చేసింది.  అయితే రిషీ మరణంతో ఆ స్థానంలో అమితాబ్‌‌ను తీసుకున్నారు. కానీ కొవిడ్‌‌ పాండమిక్‌‌, ఆ తర్వాత దీపిక మెటర్నిటీ బ్రేక్ తీసుకోవడం, షెడ్యూల్‌‌ ఇష్యూస్‌‌తో ఇంతవరకూ పట్టాలెక్కలేదు. 

ఇప్పుడిక దీపిక స్థానంలో మరో హీరోయిన్‌‌ను రీప్లేస్‌‌ చేయబోతున్నారు. నిర్మాతగా మాత్రం దీపిక కొనసాగనున్నట్టు తెలుస్తోంది.   షారుఖ్‌‌ ‘కింగ్‌‌’, అల్లు అర్జున్‌‌ సినిమా, ప్రభాస్‌‌ ‘కల్కి 2898’ సీక్వెల్‌‌తో పాటు మరికొన్ని సినిమాలు తన లైనప్‌‌లో ఉండడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌‌ నుంచి తప్పుకున్నట్టు చెబుతున్నారు.