
హైదరాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గోనె సంచిలో మహిళ మృతదేహం దొరికిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు 38 కిలోమీటర్లు మహిళ మృతదేహంతో ట్రావెల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నార్సింగ్లో ఆటో బుక్ చేసుకున్న నిందితుడు.. నార్సింగ్ నుంచి చర్లపల్లికి మృతదేహంతో ప్రయాణం చేశాడు.
మూటతో పాటే ఆటో ఎక్కాడు. నిందితుడు శవంతో కలిసి ప్రయాణం చేసిన ఆటోను గుర్తించిన పోలీసులు ఆ ఆటో డ్రైవర్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. మూటలో ఉన్నది మృతదేహం అని తనకు తెలీదని ఆటో డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చాడు. రైల్వే స్టేషన్లో మూటను వదిలేశాక బట్టలు మార్చుకుని నిందితుడు వెస్ట్ బెంగాల్కు వెళ్ళే ట్రైన్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు.
రెండు రోజుల క్రితం చర్లపల్లి రైల్వే స్టేషన్లో గోనె సంచిలో మహిళ మృత దేహం లభ్యమైన సంగతి తెలిసిందే. చర్లపల్లి రైల్వే స్టేషన్ రిజర్వేషన్కౌంటర్సమీపంలో మంగళవారం (సెప్టెంబర్ 16, 2025) ఓ ప్లాస్టిక్ సంచిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆటోల పార్కింగ్ పక్కన ఉండే రిజర్వేషన్ కౌంటర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం దవాఖానకు తరలించారు.