బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. రోజు రోజుకు ఉత్కంఠతను రేపుతోంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది. గత కొన్ని వారాలుగా లీస్ట్ ఓటింగ్ లో సేవ్ అవుతూ వస్తున్న సుమన్ శెట్టి, సంజన ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ అందరి అంచనాలను తలకిందులు చేసింది.
ఒక్కసారిగా మారిన లెక్కలు..
ఈ వారం నామినేషన్ లో తనూజ, సుమన్ శెట్టి, సంజన, రీతూ, డెమాన్ పవన్, భరణి ఉన్నారు. కానీ ఎలిమినేషన్ ప్రక్రియ ఎవరూ ఊహించని విధంగా జరిగింది. స్టాంగ్ కంటెస్టెంట్ గా , ఆన్ లైన పోల్స్ లో రెండో స్థానంలో ఉన్న రీతూ చౌదరిని హౌస్ నుంచి బయటకు పంపించారు. అయితే ఈ ఆన్ లైన్ ట్రెండ్స్, లెక్కలు, టాస్క్ లలో పనితీరును వంటి వాటన్నిటినీ పక్కన పెట్టి రీతూను ఎలిమినేట్ చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అదే ఆడియన్స్ ఇచ్చిన జడ్జిమెంట్.
సంజన ఇష్యూనే రీతూ ఎలిమినేషన్‌కు కారణమా?
రీతూ చౌదరి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం .. ఆమె హౌస్‌లో ప్రవర్తించిన తీరు, ముఖ్యంగా సంజనాతో జరిగిన వివాదం అని భావిస్తున్నారు. హౌస్‌లో డెమాన్ పవన్‌తో రీతూ చౌదరి మెయింటైన్ చేసిన 'అన్‌హెల్దీ రిలేషన్' గురించి సంజన బహిరంగంగా మాట్లాడినప్పుడు ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, సంజనను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించారు. ఒక అమ్మాయి క్యారెక్టర్‌పై పబ్లిక్‌గా మాట్లాడటం తప్పు అంటూ సంజనతో క్షమాపణ చెప్పించాలని ప్రయత్నించారు.
విసిగిపోయిన ఆడియన్స్..
అయితే, ఇక్కడే బిగ్ ట్విస్ట్ జరిగింది. ఆడియన్స్ రియాక్షన్ రీతూకి పెద్ద మైనస్ అయింది. రీతూ చౌదరి, డెమాన్ పవన్‌తో కలసి ఎప్పుడూ రొమాన్స్ చేసుకోవడం, రాత్రిపూట వారి చేష్టలు చూసి విసిగిపోయిన ఆడియన్స్, సంజనాకే సపోర్ట్ చేశారు. ఆ వివాదం తర్వాత, లీస్ట్ ఓటింగ్‌లో ఉండే సంజన ఒక్కసారిగా టాప్ 2కి దూసుకెళ్లింది. అంటే, రీతూ చౌదరి బిహేవియర్ బిగ్ బాస్‌కు నచ్చినా, సాధారణ ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు. ఆట అంటే కేవలం టాస్క్‌లు గెలవడం మాత్రమే కాదు, బిహేవియర్ కూడా ముఖ్యమని ఆడియన్స్ తన ఓటు ద్వారా తేల్చిచెప్పారు. చివరకు రీతూకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది.
కన్నీళ్లు పెట్టుకున్న డెమాన్ పవన్
హౌస్ టాస్క్‌ల పరంగా సంజన, సుమన్ శెట్టి కంటే రీతూకు తిరుగులేదు. ఏ టాస్క్ ఇచ్చినా బెస్ట్ ఇచ్చేది. ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్‌లలో కూడా టాప్ 2 వరకూ వచ్చింది. అయినప్పటికీ, బిహేవియర్ కారణంగా టాప్-5 చేరకుండానే ఆమె జర్నీ ఎండ్‌కార్డ్ పడింది. రీతూ ఎలిమినేట్ కావడంతో హౌస్‌మేట్స్ అందరూ షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా ఆమెతో రిలేషన్‌లో ఉన్న డెమాన్ పవన్ కన్నీళ్లు పెట్టుకుని రీతూకు వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది. హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, టాస్క్‌ల విషయంలో నిలబడిన రీతూ, చివరకు ఆడియన్స్ వ్యతిరేకతను తట్టుకోలేక హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఈ షాకింగ్ ఎలిమినేషన్, బిగ్ బాస్ హౌస్‌లో ప్రజల తీర్పుకు మించినది ఏదీ లేదని మరోసారి నిరూపించింది .
