
బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season 7) సందడి మొదలుకానుంది. ఇవాళ (సెప్టెంబర్ 3) సాయంత్రం 7 గంటల నుండి షో ప్రారంభ కార్యక్రమం మొదలు కానుంది. నిజాంనికి ఈ సీజన్ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి సీజన్ ని చాలా కొత్తగా పప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు.
అదేంటంటే.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ లోనే కంటెస్టెంట్ కు రూ.35 లక్షల క్యాష్ ఆఫర్ చేసినట్టు చూపించారు. ఎవరైనా ఆ క్యాష్ తీసుకొని ఇప్పుడే బయటికి వెళ్లిపోవచ్చు అనే ఛాన్స్ కూడా ఇచ్చారు. నిజానికి క్యాష్ బాక్స్ అనేది ప్రతీ సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మాత్రం పంపిస్తారు. కానీ ఈసారి చాలా కొత్తగా మొదటి ఎపిసోడ్ లోనే క్యాష్ బాక్స్ ఆఫర్ ఇచ్చి అటు ఆడియన్స్ ను, ఇటు కంటెస్టెంట్స్ ను ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాదు.. ప్రోమోలో సూట్ కేస్ కోసం కంటెస్టెంట్స్ కొట్టుకున్నట్లుగా కూడా చూపించారు. అంటే ఎవరో ఒకరు తీసుకుని ఉంటారని, ఆ సూట్ కేస్ తీసుకున్న వ్యక్తి ఎవరై ఉంటారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.
ఒకేవళ మొదటిరోజే రూ.35 లక్షల ఆఫర్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఒక టాస్క్ ఆడకుండా.. ఎలాంటి ఎలిమినేషన్స్, ఎమోషన్స్ లేకుండా డైరెక్ట్ గా రూ.35 లక్షలు రావడం అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆ అవకాశాన్ని అందరూ రిజెక్ట్ చేశారట. నిజానికి చాలా మంది డబ్బు కోసం కాకుండా బిగ్ బాస్ ను ఎక్స్పీరియన్స్ చేయడానికే వస్తారు. అందులో గెలవడం అనేది కేవలం బోనస్ మాత్రమే. అలాంటప్పుడు ఈ క్యాష్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడకపోవచ్చు. ఇప్పుడు కూడా అదే జరిగింది.
ఎలా అయితేనే బిగ్ బాస్ సీజన్ 7పై మొదటి ఎపిసోడ్ నుండే అంచనాలు పెరిగేలా చేస్తున్నారు మేకర్స్. చూడాలి మరి ఈ సీజన్ ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించనుందో.