హైకోర్టును ఆశ్రయించిన బిగ్ బాస్ నిర్వాహకులు

హైకోర్టును ఆశ్రయించిన బిగ్ బాస్ నిర్వాహకులు

బిగ్‌ బాస్‌ సీజ‌న్ 3 తెలుగు పై వివాదాలు, విమర్శలు పెరుగుతున్నాయి.  కంటెస్టెంట్ నుంచి క‌మిట్ మెంట్స్ అడుగుతున్నారంటూ యాంక‌ర్ శ్వేతారెడ్డి, న‌టి గాయ‌త్రి గుప్తాలు ఆ కార్య‌క్ర‌మం నిర్వాహ‌కుల‌పై బంజారా హిల్స్ , రాయదుర్గం పోలీస్ స్టేష‌న్ ల‌లో ఫిర్యాదు చేశారు.. దీనిపై పోలీసులు విచార‌ణ చేపట్టారు. ఈ క్రమంలోనే బిగ్‌ బాస్‌ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. త‌మ‌పై దాఖ‌లైన కేసుల‌ను కొట్టివేయాలంటూ బిగ్ బాస్ కో ఆర్డినేష‌న్ టీమ్ క్యాష్ పిటిష‌న్ ను హైకోర్టులో దాఖ‌లు చేసింది. దీనిపై కోర్టు నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సి ఉంది.

ఇదే సమయంలో.. సినిమాల్లాగే బిగ్‌ బాస్‌ కు సెన్సార్‌ ఉండాలని, రాత్రి 11 గంటల తర్వాతే ప్రసారం చేయాలని పిల్ దాఖలైంది. నాగార్జున సహా పది మందిని ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.