బిగ్బాస్ షోలో వడ పావ్ చంద్రిక.. రోజు సంపాదన ఎంతో తెలుసా?

 బిగ్బాస్ షోలో వడ పావ్ చంద్రిక.. రోజు సంపాదన ఎంతో తెలుసా?

ఢిల్లీలోని వీధుల్లో వడ పావ్ అమ్మడం నుండి  బిగ్ బాస్ హౌస్‌కు చేరుకుంది చంద్రికా దీక్షిత్. వడ పావ్ అమ్మాయిగా సోషల్ మీడియాలో బాగా ఫేమసైన చంద్రికా వడ పావ్ అమ్ముతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె సంచలనంగా మారింది. ఆమె ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ 3 లో  కనిపించనుంది. స్టార్ హీరో అనిల్ కపూర్ దీనిని హోస్ట్ చేస్తున్నారు.  జూన్ 21న ఈ రియాలిటీ షో గ్రాండ్ గా ఓపెన్ అయింది.   

బిగ్ బాస్ ఓటీటీ 3 హౌస్‌మేట్స్‌తో సంభాషణ సందర్భంగా గార్డెన్ ఏరియాలో కూర్చున్న చంద్రిక తన రోజువారీ సంపాదన గురించి వివరాలను మిగితా హౌస్‌మేట్స్‌తో పంచుకుంది, చంద్రికా దీక్షిత్ ఢిల్లీలో తన వైరల్ స్ట్రీట్ ఫైట్ గురించి వివరాలను వెల్లడించింది.  వడ పావ్ అమ్మడం ద్వారా రోజుకు రూ.40,000 సంపాదిస్తున్నట్లు తెలిపింది. దీంతో హౌస్‌మేట్స్‌ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

అందం, ప్రతిభ పుష్కలంగా ఉన్న ఫుడ్ వ్లాగర్‌కు వడ పావ్ గర్ల్ అనే పేరు ఉంది. ముంబైలో ఆమె చేసే వడా పావ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన  ఫాలోయింగ్ అయింది.  ఇన్ స్టాగ్రామ్‌లో ఆమెకు 3.6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ఇతర మాధ్యమాల్లో కూడా భారీగా ఆదరణ ఉంది. బిగ్ బాస్ షోలో ఆమె ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.