ఈ సీజన్కు శివాజీ విలన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

ఈ సీజన్కు శివాజీ విలన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

కింగ్ నాగార్జున(Nagarjuna) హోస్ట్‌గా చేస్తున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-7(Bigg boss season7) ఫుల్ స్వింగ్ లో ముందుకు సాగుతోంది. వారవారం కొత్త కొత్త ట్విస్టులతో ఆడియన్స్ ను తెగ ఎంటర్టైన్ చేస్తోంది ఈ సీజన్. దీంతో రికార్డు స్థాయి రేటింగ్స్‌ను దక్కించుకుంటుంది మా ఛానల్. నామినేషన్స్, ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇలా ప్రతీ విషయంలోనూ ఆడియన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది ఈ సీజన్. దీంతో ఈ సీజన్ పై గత సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. 

ఇందులో భాగంగానే ఇటీవల సీజన్ 4 కంటెస్టెంట్ సోహైల్(Sohail) సీజన్ 7పై తన అభిప్రయాన్ని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సీజన్-5లో టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచిన మానస్(Manas) సీజన్ 7పై కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మానస్ సీజన్ 7 స్ట్రాంగ్ కంటెస్టెంట్ శివాజీ(Shivaji) పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో భాగంగా మానస్ మాట్లాడుతూ.. ప్రతీ సీజన్‌లో శివాజీ లాంటి ఒక  విలన్ ఉంటాడు కానీ.. హీరో ఎవరనేది మాత్రం ఆడియన్స్ చేతిలో ఉంటుంది. శివాజీ కేవలం ఇద్దరికి మాత్రమే ఫెవర్ గా ఉంటున్నాడు. అందుకే.. మిగిలిన కంటెస్టెంట్ల ఆటను చెడగొట్టాలని చూస్తున్నాడు. నేను ఇప్పటివరకు చాలా రకాల మైండ్ సెట్ ఉన్నవాళ్లను చూశాను కానీ.. శివాజీ లాంటి కంటెస్టెంట్‌ను మాత్రం ఇప్పటివరకు చూడలేదు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మానస్. ప్రస్తుతం మానస్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి మానస్ చేసిన ఈ కామెంట్స్ పై శివాజీ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

ALSO READ :- ఖర్గేతో వివేక్ వెంకటస్వామి కుటుంబం భేటీ : కేసీఆర్ ను ఓడించేందుకు పని చేస్తాం