బిగ్ బాస్ సీజన్ 6 నుంచి మరో అప్ డేట్

బిగ్ బాస్ సీజన్ 6 నుంచి మరో అప్ డేట్

100 పర్సెంట్ ఎంటర్ టైన్మెంట్ కొలమానంగా ఈసారి సరికొత్తగా మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది బిగ్ బాస్ సీజన్ 6. ఈ షోకు సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయిపోయింది. దీంతో షోలో పార్టిసిపేట్ చేసే ఇంటి సభ్యులు ఎవరెవరా అని టీవీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. పార్టిసిపెంట్స్ లో ఓ ముగ్గురి పేర్లు బయటికొచ్చినట్టు తెలుస్తోంది. వారే నటి వాసంతి కృష్ణన్, నటులు శాని సల్మోన్, విశాల్ రాజ్. ఇందులో వాసంతి కృష్ణన్ ఇటీవల దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్ లో నటించారు.  

ఇక బిగ్ బాస్ సీజన్ 6 కు సంబంధించి ఇప్పటికే ప్రోమో, లోగో రిలీజ్ కాగా... హోస్ట్ గా గత మూడు సీజన్ల నుంచీ అక్కినేని నాగార్జునే నిర్వహించడం తెలిసిందే. ఈ సారి కూడా తన యాంకరింగ్ తో బుల్లితెర అభిమానులను ఆకట్టుకునేందుకు నాగ్ మాంచి ఊపులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్ ఈసారి చాలా గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. టీవీ టెలివిజన్ చరిత్రలోనే ఎన్నోసార్లు టాప్ రేటింగ్ లో నిలిచిన బిగ్ బాస్ రియాలిటీ షో సెప్టెంబర్ 4న  ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్ గా ఉన్నారు.