
మరికొన్ని రోజులి బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) సందడి మొదలుకానుంది. ఈ సీజన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జునే(King Nagarjuna) హోస్ట్ చేస్తుండగా .. దీనికి సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోకు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ప్రోమో చాలా కొత్తగా ఉండటంతో.. ఈసారి సీజన్ సరికొత్తగా ఉండనుందని అర్థమయ్యింది.
ఇదిలా ఉండగా ఈసారి బిగ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఒక లిస్ట్ వైరల్ అవుతోంది. మరి అందులో ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారనే డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 లిస్టులో ముందు నుండి వినిపిస్తున్న పేరు అమర్ దీప్. జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నటుడు. అంతేకాదు తనకు కాబోయే భార్య తేజస్వినితో జోడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్లో మోనిత పాత్ర చేసిన నటి శోభా శెట్టి కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టనుంది. ఆ తర్వాత మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్, జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్, సీరియల్ నటి పూజా మూర్తి, అంజలి పవన్, డాన్స్ మాస్టర్ ఆట సందీప్, ప్రముఖ యూట్యూబర్ అనిల్ గీల, రంగస్థలం మహేష్, సీతల్ గౌతమన్, పల్లవి ప్రశాంత్, జబర్దస్త్ కమెడియన్స్ బుల్లెట్ భాస్కర్, రియాజ్, తేజ, న్యూస్ యాంకర్ ప్రత్యూష, హీరో గౌతమ్ కృష్ణ, యాక్టర్ క్రాంతి, సింగర్ దామిని, అన్షు, మోడల్ యవార్ ఈ లిస్టులో ఉన్నారు.
మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఈ కొత్త సీజన్ కోసం కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఇక ఈ లిస్టులో వినిపిస్తున్న మరికొన్ని పేర్లు నటి షకీలా, హీరో అబ్బాస్, హీరోయిన్ ఫర్జానా.. ఈ ముగ్గురి పేర్లు కూడా ఈ సీజన్ కంటెస్టెంట్ ల లిస్టులో వినిపిస్తున్నాయి. కానీ వీరి రాకపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీ నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.