
బిగ్‌బాస్ సీజన్ 7(Bigg boss season 7)లో రెండో రోజుకే గొడవలు మొదలయ్యాయి. ఇక సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక ఇంకా శివాజీ మాత్రమే తమ నామినేషన్స్ పూర్తి చేయగా.. మంగళవారం కూడా అది కంటిన్యూ అయ్యింది. ఇంట్లోకి వచ్చి రెండు రోజులే అయ్యింది కాబట్టి అందరూ సిల్లీ రీజన్స్ తినే నామినేట్ చేసుకున్నారు. దీంతో హౌస్ అంతా అలకలు, బుజ్జగింపులతో గొడవగా మారింది. ఇక నామినేషన్స్ లో శోభాశెట్టికి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. చాలా మంది ఆమెను సరిగా పనిచేయడం లేదు అనే రీజన్స్ మీద నామినేషన్ చేశారు. దీంతో కాస్త హార్ట్ అయినా ఆమె కెమెరా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది.
Also Read : జలదృశ్యం ..పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు డ్యామ్ (వీడియో)
ఇకDay 2 హైలైట్స్‌లో విషయానికి వస్తే. కేవలం రెండు రోజుల్లోనే హౌస్ లో గ్రూప్ లు క్రియేట్ అయ్యాయి. నామినేషన్స్ వల్ల కొంతమంది మాటామాటా అనుకున్నారు. తొలుత శోభాశెట్టి.. గౌతమ్, కిరణ్ రాథోడ్‌ని నామినేట్ చేసింది. తెలుగు సరిగా మాట్లాడని కారణంగా కిరణ్‌ని, కనెక్ట్ కాకపోవడం వల్ల గౌతమ్‌ని నామినేట్ చేసింది. దీనిపై ఈ ముగ్గురి మధ్య వాగ్వాదమె జరిగింది.
ఆ తర్వాత దామిని.. రతికని, శోభాశెట్టిని నామినేట్ చేసింది. ఇద్దరు సరిగా పనిచేయడం లేదనే రీజన్ చెప్పింది. ఈ విషయంపైనే శోభా కన్నీళ్లు పెట్టుకుంది. ఆతరువాత యావర్.. షకీలా, గౌతమ్‌ని.. ఆట సందీప్.. రతికని, యావర్ ని, షకీలా.. యావర్, పల్లవి ప్రశాంత్ ను, శుభశ్రీ.. రతిక, శోభాశెట్టిని, పల్లవి ప్రశాంత్.. షకీలా, కిరణ్ రాథోడ్‌ని, అమర్‌దీప్.. ప్రిన్స్, తేజని, కిరణ్ రాథోడ్.. ప్రశాంత్, శోభాశెట్టిని, టేస్టీ తేజ.. పల్లవి ప్రశాంత్, కిరణ్‌ని, రతిక.. ప్రియాంక, దామినిని నామినేట్ చేసుకున్నారు. ఇక మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 7 మొదటి వారం నామినేషన్స్ లో.. శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, కిరణ్, గౌతమ్, షకీలా, దామిని నిలిచారు. మరి ఈ ఎనిమిది మందిలో ఎవరు బయటకు వెళ్లనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.