Bigg Boss9: ఊహించని మలుపులతో బిగ్బాస్.. ఎంట్రీతోనే కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేట్‌.. అసలేం జరిగిందంటే?

Bigg Boss9: ఊహించని మలుపులతో బిగ్బాస్..  ఎంట్రీతోనే కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేట్‌.. అసలేం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లితెర రియాల్టీ షో 'బిగ్ బాస్ ' తరుణం వచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా, ఉత్కంఠ, వినోదం, ఊహించని మలుపులతో ‘బిగ్ బాస్ తెలుగు 9’ సరికొత్త డబుల్ హౌస్‌తో ఇవాళ (సెప్టెంబర్ 7న)  ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు క్రేజీ రచ్చ షురూ మొదలవ్వనుంది. లేటెస్ట్గా షో లాంచ్‌ ప్రోమో రిలీజ్ చేస్తూ ముందస్తు అంచనాలు పెంచారు బిగ్ బాస్ నిర్వాహకులు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ సైతం ఎంట్రీ కల్పించిన ఈ సరికొత్త సీజన్ ప్రోమో ఆకట్టుకుంటుంది.

"ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌజ్‌తో.. డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9" అని నాగార్జున వాయిస్‌తో ప్రోమో మొదలైంది. కళ్లకు గంతలు కట్టుకుని బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టాడు నాగార్జున. "ఇప్పటివరకు నాలో యుద్ధభూమిలో శంఖం పూరించిన కృష్ణుడును చూశారు. ఇప్పుడు రంగంలోకి దిగే అర్జునున్ని చూస్తారు" అని బిగ్ బాస్ వాయిస్ ఓవర్ తో అనడం ఆసక్తి కలిగిస్తుంది.

"నేను దేనికైనా సిద్ధమే" అని నాగార్జున కళ్లకున్న గంతలు తీసి హౌజ్ మొత్తం చూస్తాడు. ఇక ప్రోమో చివర్లో 'మార్పు సరిపోయిందా నాగార్జున' అని హౌజ్ బిగ్ బాస్ అడుగుతాడు. ఈ క్రమంలో సరిపోయింది బిగ్ బాస్. "మీ తీరు మారింది.. ఇల్లు మారింది. ఒక ఇల్లు అయితే ఆట చదరంగం అయ్యేది. రెండో ఇల్లుతో ఆట రణరంగం అయిపోయింది" అని నాగార్జున చెప్పి అంచనాలు పెంచేశాడు. మొత్తానికి ఈ కొత్త ప్రోమో చూస్తే గత సీజన్లకు భిన్నంగా ఉండబోతోందనే క్లారిటీ అయితే వచ్చేసింది.  

కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేట్‌:

అయితే, ఇక్కడ ఓ కంటెస్టెంట్ మైండ్ సెట్.. హౌజ్లో ఉన్నవారికే కాదు నాగార్జునకు సైతం షాక్ ఇచ్చింది. అతను హౌజ్‌ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తనతో పాటుగా ఓ బాక్స్‌ను తీసుకెళ్లడానికి ట్రై చేస్తాడు. ‘బిగ్ బాస్ ఇది నా బాడీలో ఓ భాగం. దయచేసి లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వండి‌’ అని బిగ్ బాస్‌తో చెప్పుకుంటాడు.

►ALSO READ | Maalik OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న గ్యాంగ్‌స్టర్‌ క్రైమ్‌ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘అసలు ఎలాంటి వస్తువు ఏం మీతో తెచ్చుకోడానికి వీళ్లేదు‌’ అని బిగ్ బాస్ బదులిస్తాడు. ఇక ఆ వెంటనే 'అయితే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతానని" సెల్ఫ్ ఎలిమినేట్ అవుతాడు ఆ కంటెస్టెంట్. అది మీ ఇష్టం అని బిగ్ బాస్ చెప్పకనే చెప్పేస్తుంది. దాంతో ఆ కంటెస్టెంట్ ఇంటికి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా స్టేజీపైకి వచ్చి రాగానే ఇలా వెళ్తానంటాడేంటీ అని నాగార్జున షాక్ అయిపోతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.